పల్లవి:నీ రక్తమే - నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్ - నీ రక్తమే నా బలము (2)
1. నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చును (2) పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము (2)
2. నశించువారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నద
3. నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే పాప విముక్తిఁ జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ
4. పందివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను ప్రేమతో జేర్చుకొంటివి - ప్రభువా నీ కే స్తోత్రము
5. నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే
6. స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును