CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 278

సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల

siluvalo baliyaina devuni gorrepilla

Isaiah 53:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల (1)విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు (2)
1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి (2) కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే (2)
2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా
3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా
4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి
5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి మౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా
6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా
7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu