పల్లవి:ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను -ఖైదీలను విడిపించెను సిలువలో (2)
1. ఎంత కౄరమో - ఎంత కౄరమో -శత్రు కార్యము చూడుమా (2) అంతగా బాధించి సిలువమీద కెత్తిరి (1) బాధనొందియు (2) - ఎదురు మాటలాడక (1)
2. ముండ్ల మకుటము - ముండ్ల మకుటము - తన తల నుంచిరి మూర్ఖుల దెబ్బల బాధను సహించెను మూసియుండిన - మోక్షద్వారము తెరచి
3. ఆత్మదేవుడు ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలో సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి సార్వత్రికము - గడగడ వణికెను
4. మరణించెను - మరణించెను - సమాధి నుంచబడెను మూడవనాడు సమాధినుండి లేచెను విడిపించెను - మరణ బంధితులను
5. తీసివేసెను - తీసివేసెను -నా పాప నేరమంతయు దేవయని ప్రభు అరచిన యపుడు దేవునిదయ - కుమ్మరించబడెను
6. కారు చీకటిలో - కారు చీకటిలో - దుఃఖంబులలో నేనుంటిని నీకువేరుగా నారక్షణిల లేదుగా నాదు శ్రమలు - వేరెవ్వరు నెరుగరు