పల్లవి:యేసు ప్రభూ నా కొరకై - బలిగాను నీవైతివి (2)
1. సిలువలోన యేసు - నీదు ప్రాణమిచ్చితివి.... (2) ప్రాణమిచ్చితివి - ప్రాణమిచ్చితివి.... (2)
2. సిలువ రక్తము తోడ - నన్ను జేర్చుకొంటివి - చేర్చుకొంటివి
3. నీ వెలుగును నీవు - నాలో వెలిగించితివి - వెలిగించితివి
4. నీ ప్రేమను నీవు - నాలో నింపితివిగా - నింపితివిగా
5. నా పాపము నంతటిని - నా నుండి తీసితివి - తీసితివి
6. నిత్యము నే నిన్ను - స్తుతియించి కీర్తింతును - కీర్తింతును