పల్లవి:దేవసుతుడు యేసు జన్మించె - నిరతము స్తుతియింతుము - దేవసుతుడు (1)
1. పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...2 నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను (1)
2. బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము
3. ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము
4. పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటిలో స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెను
5. నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని
6. అనాది దేవుని చిత్తముచే - శ్రీ - యేసు బయలుపడెను జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును
7. ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము హల్లెలూయ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్