పల్లవి:మరియకు సుతుడుగ ధరను జన్మించి - ఇమ్మానుయేలాయెన్
అను పల్లవి:నిరుపేదగాను పశువుల పాకలో - తేజోమయ ప్రభు భువునిశిశువుగ బుట్టెను
1. పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్
2. ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్ హీన సైతానుడు కూలిపోవగన్ -ప్రియముతో ఉదయించెన్
3. దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా