పల్లవి:యెహోవా కార్యములన్నిటికై - అర్పింతు కృతజ్ఞతలు (2)ఆశించెడి వారి ప్రాణములెల్లను (2) - సంతృప్తి పరచెదవు (1)
1. వెదకిన నా మది కొసగెను రక్షణ - దర్శనమిచ్చి దరి జేర్చితివి (2) నీ రాజ్యమును నీ నీతియును వెదకుమని నన్ను - ప్రేమతో పిలిచితివి (2)
2. కనిపించెడి ఆ కానానును జూడ - ధన్యతలకది ధననిధిగా నుండె దానిపై నుండు నీకను దృష్టి దివా రాత్రులు ప్రియమది నీకెంతో
3. నూతన మాయెను భూమ్యాకాశముల్ - పాపముల్ పడిన సముద్రములేదట పరిశుద్ధంబైన యెరూషలేమది దేవుని మహిమతో దిగివచ్చుచుండె
4. కళంకము లేక - అలంకరించిన - పెండ్లి కుమార్తెయై - ప్రియునిజూచు సంఘము యిదియే - ప్రియుడా కనుమా కానవు నెచ్చటన్ - ఈ వజ్రకాంతుల్
5. శిల్పియై యెహోవా - నిర్మించుచున్న పండ్రెండు పునాదుల - ఆ పట్టణముకై నబ్రహాము ఎదురు చూచెనుగా పరికించుము నీవు - నీ కన్నుల నెత్తి
6. కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును నరహంతకులును - విగ్రహారాధికులు అబద్దమును - ప్రేమించి జరిగించు ప్రతివాడునట - వెలుపట నుందురుగా
7. కృప కాలంబిది - ఓ నా ప్రియుడా - నిర్మల వాక్యమన్ - పాలను పొంది శిశువును బోలి - ఎదుగుము నీవు పదములు నేర్తువు - అపవాది నెదిరింపన్