CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 249

యెహోవ మన కొరకు గొప్ప కార్యములను

yehova mana koraku goppa kaaryamulanu

Psalms 126:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవ మన కొరకు గొప్ప కార్యములను (2)జేసెనని మనము ఆనందించెదము (2)యెహోవ మన కొరకు - గొప్ప కార్యములను (2)
1. ఆయన యేర్పరచిన దినమిది (2) -అగుపడె మనకు ఆశ్చర్యముగా (2) దీనియందు మనముత్సహించుచు (2) -సంతోషించెద మెప్పుడు (2)
2. తన సేవకులు మొర పెట్టగానే - కనుపరచెను ప్రభువు ఈ స్థలమును మన మెల్లరమును యేకముగా కూడి - మహిమను చాటెదము
3. యాకోబులో ప్రభుయే దోషమును - ఇశ్రాయేలులో యే వంకర తనమున్ కనుగొనలేదే ప్రభు యెహోవా - తనకే స్తుతి చెల్లింతము
4. క్రీస్తే మనకు మూలరాయైయుండ - ప్రవక్తలు వేసిరి ఆ పునాది దానిమీద కట్టబడితిమి మనము -తన రక్షణ ప్రకటింతము
5. ప్రతి కట్టడమును ఆయనలోనే - పదిలముగా నమర్చబడినదై అతిసుందరంబైన గృహముగా - స్తుతియించి సేవింతుము
6. మన ప్రభువైన క్రీస్తే సునందు - పరిశుద్ధ ఆలయముగ మనము నిర్మింపబడితిమి ఈ భువియందు - సాగిలపడి మ్రొక్కెదము
7. ఘనదేవా నీవే సమస్తమును - బాగుగాను చేసితి వనుచు స్తుతి మహిమ ప్రభావములు - నీకే హల్లెలూయా

Back to Hebron Seeyonu Geethalu