పల్లవి:పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే (2)
1. ఏర్పరచుకోలేదు నేను - ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2) పాపినైన నాకు - ఆయనే రక్షణ నిచ్చెన్ (2) పరలోక రాజ్యములో - భాగమునిచ్చెన్ (2)
2. నా హృదయ పాపమును - తన రక్తములో కడిగెన్ మృతమైన నా ఆత్మను - జీవింపజేసె ప్రభు ఉచితంబుగానే పొందితి - నిత్య జీవం
3. నే పాప బంధములో నుండ - హృదయమశాంతితో నిండె నా పాప మొప్పుకొనగా - కడిగెను రక్తములో శాంతి ఆనందముతో - నన్ను నింపెన్
4. వర్ణింపజాలను నేను - ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నను ప్రేమించెన్ - మరువలేనా ప్రేమను ప్రశంసలను పాడెద - ప్రభునకే
5. నిత్య రాజ్యము నన్ను చేర్చ - నిత్య నిబంధన చేసె సుఖదుఃఖములందైన - ముగింతు నాదు పరుగున్ స్థిరముగ నుందు పరమును చేరువరకు