పల్లవి:దేవుని కీర్తించెదము - దైవపుత్రుని నామమందు (2)
1. యోసేపుపై దృష్టినుంచి మోసపు చెరనుండి గాచి (2) యేసునం దైగుప్తు నుండి (2) క్రీస్తునందరిని గాచిన (1)
2. పాప ఋణముచేత నిత్య - కోపమునకు గురియైతిమి శాపగ్రాహియై శ్రీ యేసు - పాప ఋణము తీర్చినాడు
3. మార్గ సత్య జీవమై నిత్య - మరణ భయము లేనివాడు మరణ బంధితులను గావ - మరణమొంది లేచినాడు
4. నీతిమంతుడైన యేసు - నీతి కార్యములను జేసి నీతి నిలయుండై తండ్రి నిల - నీతితోనే తృప్తిపరచెన్
5. యేడ్చెను మన పాపములకై - కార్చెను తనరక్తము నిల ఓర్చెను తన శత్రువులను - గెల్చెను తన సిలువలోనే
6. లేదు నీకు భయము చింత - లేదు నమ్మి నిలచినచో నీదు స్వాస్థ్యమంత తిరిగి - నాథుడేసులో పొందగలవు
7. జయము పాడు ప్రియుడ లేచి - జయ జీవితము నొంది వేగ జయశీలుండు కీస్తు యేసుని - జయము పాడు హల్లెలూయ