CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 243

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని

aanandamugaa yehovaa nee krupalanni

Lamentations 3:23

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆనందముగా యెహోవా నీ కృపలన్ని - అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)
1. చావు గోతినుండి లేవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవదాత (2) వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో - సవ్యంబుగా ఈ భువియందున్ (2)
2. సింహపు పిల్లలు - ఆకలిగొనును- యెహొవా సహాయుడందరికి ఇహమందున ఏ మేలు కొదువయుండదు అహా! ఏమందు నీ విశ్వాస్యతన్
3. ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్
4. చావు చీకట్ల లోయలందున - జీవపు వెలుగై త్రోవ జూపి దేవా తోడై నడిపించితివి నీ కృపన్ - వివరించెదన్ నీ విశ్వాస్యతన్
5. నీతిన్యాయంబులు - ఆధారములై - నీసింహాసనమున - నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్‌ - నిరతంబు వెలసి నిలచినవి
6. పర్వతంబులు - పారిపోయినను - ఉర్విలో మార్పు - కలిగినను తరుణములు విరోధముగ పై లేచిన - స్మరియించెద నీ విశ్వాస్యతన్‌

Back to Hebron Seeyonu Geethalu