1. పగటిలో మేఘ స్తంభముగా - రాత్రిలో యగ్ని స్తంభముగా (2) రక్షకుడవుగా నుండి (2) - ప్రభువా సుఖశాంతితో గాచితివి (2)
పల్లవి:ధన్య ధన్య ధన్య ప్రభుకు (2)- తానే రక్షణ మన కొసగే (2)నీ సన్నిధికి నడిపి (2) - ప్రభువా రాత్రింబవళ్ళు గాచితివి (2)
2. వాక్యమన్నాతో పోషించి - బండ నీళ్ళను త్రాగించితివి ఆత్మకు తృప్తినిచ్చి - ప్రభువా శాంతిని నా కిచ్చితివి ||ధన్య||
3. ఆత్మీయ సుందర హృదయములో - ఆత్మ ప్రాణ శరీరములో ఆత్మీయజీవ మొసగి - ప్రభువా ఆత్మను మేల్కొలిపితివి ||ధన్య||
4. కానానులోనికి తెచ్చితివి - పరశుధ్ధులతో జేర్చితివి ప్రణుతించెదను నిన్ను - ప్రభువా సాగిలపడి పూజింతున్ ||ధన్య||