పల్లవి:ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము (2)ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా (2)
అను పల్లవి:ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె (2)పాత్రులముగా సేవింతుము (2)
1. దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము (2) దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాడెదము (2)
2. సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని సితార స్వర మండలములతో - మన మార్భాటించెదము
3. మన భారములన్నియు తొలగించి - ఘనకార్యములను జేసె దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో
4. నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం
5. ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమము నిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము
6. మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్