CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 241

స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో

stutintun parishudduni aaraadhanato

Psalms 89:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే (2)
1. ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చే (2) చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము (1)
2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే వినిన వారిని ప్రత్యేకించె - చేరిపాడి స్తుతించెదము
3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము
4. సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెన్ ప్రభువే సహపని - వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము
5. ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము
6. పరమ దర్శనము నిచ్చి - సరిగా లోబరచె మనల కరము నిచ్చి నడిపించె - చేరిపాడి స్తుతించెదము
7. సంఘ మర్మమును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్త మార్చె పాపుల నెందరినో - చేరి స్తుతించెదము హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu