పల్లవి:యెహోవా - గొప్ప కార్యములు - చేసెను - వీరికొరకు (1)ఇహమున - అన్యజనము - లెల్ల - చెప్పుకొనుచున్నారటుల (2)
1. యెహోవా మనకొరకు - గొప్ప కార్యములు చేసెను (2) మహా సంతోషభరితుల మైతివిు - సహపనివారినిగా జేసెన్ (2)
2. ప్రారంభ కాలపనులను - పరిహసించువారెవరు ప్రభు పనిచేయ పదివేలగు నొకడు - విరవిగ బలమౌ జన మగును
3. ప్రభు సువార్తకై బహుగా మేము - బాధించబడి యుంటిమి ప్రబలెను ప్రభుని వాక్యము - ప్రబలితిమి మేము ప్రభు కృపలో
4. పొరపాటులెన్నో చేసితిమి - ప్రభుకృపతో మమ్ము క్షమించెన్ విరోధి మంత్ర శకునము లేమి - ఇశ్రాయేలులో నికలేవు
5. భూమిపై గడ్డిని తడుపు - వానవలె విజయము నిచ్చెను సమ భూమిని బోలి సముద్రములో - క్షేమముగా మము నడిపెను
6. అధికంబాయె మా అంత్యదశ - మొదటి పనులను మించెన్ మొదటి మందిర మహిమను మించె - తుది మందిరపు మహిమ
7. మహిమ ఘనతా ప్రభావములు - మా కృతజ్ఞతా స్తోత్రములు సింహాసనాసీనుండా మాదు - సీయోను రాజా హల్లెలూయా