1. స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతో (2) నిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదము (2)
పల్లవి:యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు (1)సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)
2. భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబి నుండి బలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెను ||యేసు||
3. కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడు తనచేతిలో నన్నుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము ||యేసు||
4. తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయును ఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్ ||యేసు||
5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్ స్తుతియునీకే ఘనతయు నీకే – యుగయుగములలోన ||యేసు||