పల్లవి:ఆరాధనలకు యోగ్యుడవు (2) - స్తుతి గీతంబులకు పాత్రుడవు (2)ప్రభు యేసు నిన్ను పూజింతును (2) - మనసార నిన్నే కీర్తింతును (2)ఆరాధనలకు - యోగ్యుడవు (2)
1. భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్ (2) అరిగితివి నాకై కలువరికి (2) - పరిహరించితివి పాప శిక్షన్ (2)
2. నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి చిందిన సిలువ రక్తములో - నా దారిద్య్రము తొలగించితివి
3. నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి