పల్లవి:ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా
1. నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె (2) నిక్కముగ ఋజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే (2)
2. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను
3. బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను
4. తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే
5. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను