పల్లవి:ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను (2)మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రభువా (2)
1. విస్తారంబగు - వ్యాపకములలో - విడచితి నీ సహవాసమును (2) సరిదిద్దితివి నా జీవితము (2) - నిను సేవింపగా నేర్పిన ప్రభువా (2)
2. నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని నా కన్నీటితో నీ పాదములను - కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా
3. వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును - వినయముతో నీ సన్నిధిచేరి
4. నీరక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి నీరక్షణకై స్తోత్రము చేయుచు - నిత్యమునిన్ను కొనియాడెదను
5. దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి ప్రేమతో పరమ విందు నొసంగి - ఆనందింపగ జేసిన ప్రభువా
6. ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నే నెన్నగ తరమా - నా జీవితమున చాలిన ప్రభువా
7. పెద్దలు పరిశుద్దులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగ జాలని జనమందున - నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా