పల్లవి:ఓ ప్రభువా యిది నీ కృపయే - గొప్ప క్రయము ద్వారా కలిగె (2)
1. కృపద్వారానే పాపక్షమాపణ - రక్తము ద్వారానే కలిగె (2) అపరాధముల నుండి విమోచన (2) - యేసులో మనకు ప్రాప్తించె (2)
2. కృపద్వారానే కలిగిన రక్షణ - మానవులొసగ జాలరిల క్రియలద్వారా కలుగలేదు - యేసు ప్రభుని వరమిదియే
3. కృపతో మనల పిలిచెను ప్రభువు - పరిశుద్ద పిలుపుద్వారా అపరిమిత సంకల్పమువలన - మనమెరిగితిమి ఈ ధరలో
4. కృపద్వారానే నీతి మంతులుగా - తీర్చెను మనల ఉచితముగ అపాత్రులమైయున్న మనకు - ప్రాయశ్చిత్తము కలిగెనుగ
5. కృపయే మనకు బయలు పడెను - సమస్తమును భోధించును అపవిత్ర క్రియలన్నియు విడచి - భయభక్తులతో బ్రతికెదము
6. కృపద్వారానే బలవంతులమై - ఎదురుకొనెదము యుద్ధమును ప్రభువునందు అంత మువరకు - స్థిరముగ ముందుకుసాగెదము
7. కృపద్వారానే సమీపించితిమి - దానియందే నిలిచితిమి క్రీస్తు మహిమ నిరీక్షణకై - ఆయనకే స్తుతి పాడెదము