1. రక్షకుని విచిత్ర ప్రేమన్ - పాడుచుందు నెప్పుడున్ (1) క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్ (1)
పల్లవి:పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్ (1)సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను (1)
2. తెల్పుదున్ విచిత్ర కథన్ - పాడైన నా స్థితిని కాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను ||పాడు||
3. ప్రియ రక్షకుని పాడి - జయశక్తి తెల్పుదున్ పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను ||పాడు||
4. నా రక్షకుని పరమ పాడి - ప్రేమగూర్చి పాడుదున్ చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు ||పాడు||