1. యేసుని నామ శబ్దము - విశ్వాసి చెవికి (1) దివ్యమై యాదరించు - భీతిని ద్రోలును (1)
2. గాయపడిన ఆత్మను - క్లేశహృదయము నాకలి బాధ నార్పును - విశ్రాంతి నిచ్చును
3. ఇంపైన పేరు బండయు - డాలు నాశ్రయము ధననిధీ కృపలతో - నన్నింపుచుండును
4. యేసూ నా ప్రియ కాపరి - ప్రవక్త నా రాజు ప్రభూ జీవమార్గ సత్యం - మా స్తుతి వినుము
5. నా హృదయము దౌర్బల్యము - తలంపు వ్యర్థము నిన్ను నే జూచినపుడు - సరిగా పూజింతును
6. శ్వాసించునపుడెల్లను - నీ ప్రేమ జాటుదున్ నీ నామ మధురమే నా - మృతిన్ ఆదరించున్