పల్లవి:సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్క్రీస్తు యేసు రక్షించినన్ - చేర్చెను తన మందలో (1)
1. ఘోర దుర్మార్గుడనై - దారితప్పి యుండగా (2) భూరి దయతో కాపరి యేసు - దారికి నడిపెను (2)
2. అక్షయమైనదియు - నిర్మలమైనదియు రక్షకుడేసు వాడబారని స్వాస్థ్యము నా కిచ్చును
3. భయమేమి లేదికను - ప్రభు చిన్న మందకు దయ కృపతో రాజ్యమివ్వ - తండ్రికిష్టమాయెన్
4. మంటి పురుగునకు - మింట రాజ్యమివ్వ మింటనుండి మంటి కేతెంచి - మరణ మొందె నేసు
5. దేవా నీ తలంపులు - నాకు ప్రియమైనవి శోధింప నెంతో అశక్యములు - అగమ్యములు
6. నిజకుమారుడేసున్ - మన కనుగ్రహించెను రాజ్యముతో బాటు సమస్తము నివ్వ - వెనుదీయునా?
7. మహిమ రాజ్యమునకు - మిమ్మును పిలుచుచున్న మహిమ రాజుకు తగినట్టుగా మీరు - నడుచుకొనుడి
8. రాజాధిరాజు యేసే - ప్రభుల ప్రభు యేసే పరమందు దూతలు - యిహమందు నరులు హల్లెలూయ పాడుడి