పల్లవి:అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై (1)మరణమొంది సమాధి నుండి మరల లేచితివి (2)
1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి (2) బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా (2)
2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో
3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు ఆనంద బాష్పములతోనే స్తుతింతు - ఈ ధనము నా కొరకే
4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్ నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతింతును