CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 120

రాత్రింబవళ్లు పాడెదను

Raatrimbavallu paadedanu

Luke 12:32

More
Reference recording on YouTube ↗
పల్లవి:రాత్రింబవళ్లు పాడెదను - యేసు నామం - క్రీస్తు నామం (2)
1. పురుగు వంటి నరుడ నాకు - ప్రభువు రాజ్య మియ్యదలచి (2) పరమునుండి ధరకేతెంచి (2) - ప్రాణమున్ బలిగా నిచ్చె (2)
2. ఎన్నిక లేని చిన్నమంద -భయపడకు నీవిలన్ ఘనమైన పరమతండ్రి - రాజ్యమివ్వ నిష్టపడెన్
3. పాప కూపమునందు నేను - పడి చెడి యుండ గొప్ప రక్షణ నిచ్చి పరమ - రాజ్యమందు చేర్చెను
4. నీతి హీనుడనైన నాకు - నీతి రాజ్యమివ్వదలచి నీతి రక్షణ వస్త్రములను - ప్రీతి తోడ తొడిగెను
5. పేరుపెట్టి పిలచినన్ను - పరమ రాజ్యమును తండ్రి" వారసునిగా నన్ను జేసి - వైరినిల సిగ్గుపరచెన్
6. పరమునందు దూతలు - వింత పొందునట్లుగా ఏర్పరచుకొంటివి నరుని - నరుడు ఏపాటి వాడు?
7. దానియేలు షద్రక్ మేషాక్ - అబెద్నెగో యనువారలన్ చిన్నమందగాను జేసి - రాజ్యమేల జేసెన్
8. ఎన్ని శ్రమలు వచ్చినను - సన్నుతింతు నా ప్రభున్ ఘనత మహిమ కర్హుడని - హల్లెలూయ పాడెదన్

Back to Hebron Seeyonu Geethalu