పల్లవి:వందనమో వందన మేసయ్యా (2)అందుకొనుము మా దేవా - మాదు - వందన మందుకొనుమయా (1)
1. ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో (2) మరణము నొంది మరిలేచిన మా (2) మారని మహిమ రాజా - నీకిదే వందన మందుకొనుమయా
2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ - ప్రేమకు సాటియే లేదిలలోన
3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా - దేవా హృదయార్పణ నర్పింతు
4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు - క్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు
5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ నరులపై వరదా ధరలో పోసి దురిత దూరుడ రావా - రాజా నీకిదే నా స్తుతియాగం
6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు - క్షితినిన్ చేరి స్తుతింతు
7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడ - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా - నీకిదే వందనమందుకొనుమయా