పల్లవి:సర్వంబులో నాకు సర్వమేసు - సర్వశక్తి గల యేసు (1)హల్లెలూయా - ఆమెన్ (2)
చరణం 1:పాపుల రక్షకుడు యేసు - గొప్ప దేవాది దేవుడు యేసు (1)
కృపతో కౌగలించె నన్ను యేసు - ఉపకారి నన్ను చేర్చె యేసు (1)
చరణం 2:గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు - దొరుకు తన్ను వెదకు వారి కేసు
ఆరాధికులకు పరిశుద్ధు డేసు - నిరాశగల వారి మిత్రుడేసు
చరణం 3:నాదు మార్గంబునకు వెలుగు యేసు
నాదు పాదంబులకు దీపము యేసు
నాదు దాహంబునకు పానము యేసు
నాదు యజ్ఞానంబుకు జ్ఞానము యేసు
చరణం 4:నాదు రోగంబులకు వైద్యుడు యేసు
నాదు బాధ్యతల వహించు నేసు
నాకు ఏకాంతములో తోడు యేసు
నాకు తేనెకంటే బహు తీపి యేసు
చరణం 5:నాకు రక్షకుడు రక్షణ యేసు
నాకు విమోచకుడు విమోచ నేసు
నాకు జీవంబును దేవుడు యేసు
నాకు నీతి నాదు వెలుగు యేసు
చరణం 6:నాదు హృదయంబున యున్నవాడు యేసు
నాదు వృద్ధికికారకుండు యేసు
నాదు కృంగుదలలో తోడనుండు యేసు
నాదు సర్వమందు నిల సర్వమేసు