పల్లవి:యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ (2)
చరణం 1:తరతరములకు నీ విశ్వాస్యత- తెలియపరచెదను (2)
కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి
పాపము క్షమియించె (2)
చరణం 2:ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు
నన్ను విడిపించుటకు నీవు
నమ్మ దగిన వాడవు
చరణం 3:నీదు వాత్సల్యము నాపై - నూతనముగ నుండున్
నీదు విశ్వాస్యత గొప్పదై
మారనిదై యుండున్
చరణం 4:నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగా
నమ్మకమై యున్న నా ప్రభువా
నన్ను కాచెదవు
చరణం 5:మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను
మహిమ మకుటము నిచ్చెడు ప్రభునకు
హల్లెలూయ పాడెదన్