పల్లవి:యేసు చాలును యేసు చాలును యే సమయమైనయే స్థితికైన నా జీవితములో - యేసు చాలును (1)
చరణం 1:పరము జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ (2)
నిరంతరము నడిపించును- మరల వచ్చి యేసు కొని పోవును (2)
చరణం 2:సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను
చరణం 3:పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును
చరణం 4:నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కృళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడిచినను