పల్లవి:నీ స్వరము వినిపించు ప్రభువానీ దాసుడాలకించున్ (2)నీ వాక్యమును నేర్పించుదానియందు నడచునట్లు నీతో (2)
చరణం 1:ఉదయమునే లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము (2)
దినమంతటి కొరకు నను సిద్ధపరచు (1)
రక్షించు ఆపదల నుండి (2)
చరణం 2:నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
నేను సరిజేసికొందు
నీ మార్గములో నడచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడు
చరణం 3:భయ భీతులలో తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా
ధైర్యపరచుము నన్ను
చరణం 4:నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిజేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా
చరణం 5:నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
అది రెండంచులు గల ఖడ్గం
నీ వాక్యమేగా అద్భుత అద్దం
నిజ స్వరూపమును చూపించున్
చరణం 6:నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో
నీ యందు నిలుచునట్లుగా
చరణం 7:నా హృదయములోని చెడు తలంపులను
ఛేదించునీ వాక్యము
నీ రూపమునకు మార్చును నన్ను
నీదు మహిమ కొరకేగా