పల్లవి:మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు (1)పోరాడవలె నీవే - ప్రభుశక్తితో పోవలెన్ (1)
చరణం 1:శత్రువులెందరో నీ చుట్టు చేరియున్నారు (2)
తప్పించుకొందువెట్లు? ప్రభువాజ్ఞను పాలించు (1)
చరణం 2:ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని
స్థిరుడవై నిలువవలె - శత్రువులందరి యెదుట
చరణం 3:సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో
ఆత్మీయ యుద్ధం నీది - భయపడకెవ్వరికిన్
చరణం 4:సత్యము నీ నడికట్టు తొలగు అబద్ధము నుండి
తొడుగుకో మైమరువును - ఆత్మరక్షణ పొందను
చరణం 5:పాదరక్షలు ధరించు అందించు సువార్తను
విశ్వాసమను డాలుతో - దుష్టుని అగ్ని నార్పు
చరణం 6:శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ
ఆత్మఖడ్గము తీసుకో - వాక్యమే ఆ ఖడ్గము
చరణం 7:ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠయుధమదియే
గురి యెన్నడు తప్పవు - మెళకువగా నుండిన