పల్లవి:పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్ఠయీవిని ఈ భువియందు (2)
చరణం 1:జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)-ఇంతవరకు నాకు తోడై యుండి (2)
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా (2)
నా రక్షణ కర్తవు నీవైతివి (2)
చరణం 2:గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకార శక్తుల ప్రభావము నుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా
నీవే ఆశ్రయ దుర్గంబైతివి
చరణం 3:కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా
బహుగా ధైర్యంబు నా కొసగితివి
చరణం 4:నాదేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్
వ్యాధి బాధలు బలహీనతలందు
నీ కృపను నాకు దయచేసితివి
చరణం 5:నీ ప్రేమ చేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్ట పరీక్షల యందున ప్రభువా
జయజీవితము నాకు నేర్పించితివి