CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 29

స్తుతులు నీ కర్పింతుము

stutulu nee karpintumu

కీర్తనలు 36 : 8 "నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు"

More
పల్లవి:స్తుతులు నీ కర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం (2)
చరణం 1:గడచినట్టి కాలము - కరుణతో నన్ గాంచితివి (2) వెల లేనట్టి నీ కృప - చూపినట్టి మా ప్రభు (2)
చరణం 2:నాదు దినములన్నిటిన్ - నీదు క్షేమ మేలును నీదు జాడలన్నియున్ - సారంబు నిచ్చును
చరణం 3:నీదు మందిరంబులో - మేలుచేత మమ్మును తృప్తి పరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును
చరణం 4:నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా
చరణం 5:సత్యరూపి నీవెగా - సకల సృష్టికర్తవు సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం