పల్లవి:ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలాంబులందు కీర్తించెదన్ (2)
చరణం 1:చావు గోతి నుండి లేవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవదాత (2)
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున్ (2)
చరణం 2:సింహపు పిల్లలు - ఆకలిగొనును యెహోవా సహాయుడందరికి
ఇహమందున ఏ మేలు కొదువయుండదు
ఆహా! ఏమందు నీ విశ్వాస్యతన్
చరణం 3:ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్
చరణం 4:చావు చీకట్ల లోయలందున - జీవపు వెలుగై త్రోవ జూపి
దేవా తోడై నడిపించితివి నీ కృపన్
వివరించెదన్ నీ విశ్వాస్యతన్
చరణం 5:నీతి న్యాయంబులు - ఆధారములై - నీ సింహాసనమున - నిలిచినవి
నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్
నిరతంబు వెలసి నిలిచినవి
చరణం 6:పర్వతంబులు - పారిపోయినను - ఉర్విలో మార్పు - కలిగినను
తరుణములు విరోధముగ పై లేచిన
స్మరియించెద నీ విశ్వాస్యతన్