CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 198

యవ్వనులారా మీరు బలవంతులు

yavvanulaaraa meeru balavantulu

More
పల్లవి:యవ్వనులారా మీరు బలవంతులుదైవ వాక్యము మీలో నిలచియున్నది - (2)దుష్టుని మీరు జయించియున్నారు-దేవుడే మీ పక్షముగా యుద్ధమాడెను - (2)
చరణం 1:దేవుని మూలముగా జన్మించిన పుత్రులుగా అపవాది నుండి మిమ్మును తప్పించును నడిపించును ఆత్మీయ ప్రజలనుగా -(2) అంతము వరకు మిమ్మును క్షేమముగా - (2)
చరణం 2:దైవశక్తిచే స్థిరులుగ నిలవబడి శత్రు సాతానుని మీరు యెదురించుడి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి మీరు ధీరులై పోరాడుడి
చరణం 3:సజీవుడైన యేసుడే మీతో నుండున్ సాతానుని జయించే శక్తిని ఇచ్చున్ పూర్ణబలముతో మిమ్మును బలపరచున్ విజయశాలియై మీకు విజయమిచ్చున్
చరణం 4:ప్రభుయేసు క్రీస్తు మీ పక్షముగా ఉండగా మీకు విరోధి ఎవ్వడు ఆయన ద్వారానే అత్యధిక విజయము పొందుచు మీరు చేరుడి నిత్యరాజ్య
చరణం 5:మంచి పోరాటము పోరాడుచు విశ్వాసమందు మీరు నిలచియుండుడి అంతము వరకు స్థిరులుగా నిలచుండిన నిత్యమందు బహుమానమును పొందెదరు