CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 194

హల్లెలూయ పాడెద... ప్రభు

hallelooya paadeda... prabhu

ఎఫెసీ. 5:19, 20 "మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు... తండ్రియైన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు"

More
పల్లవి:హల్లెలూయ పాడెద... ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
చరణం 1:వాగ్దానముల నిచ్చి - నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్ (1)
చరణం 2:నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవే మహా సామర్థ్యండవు - నా రక్షణ శృంగము నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
చరణం 3:ఎందరు నిన్ను చూచిరో - వారికి వెలుగు కల్గెన్ ప్రభువా నే వెలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
చరణం 4:భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
చరణం 5:కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును నీ కొఱకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
చరణం 6:ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన మహిమ నీకే ఓ ప్రభూ- ఇదియే నా దీన ప్రార్ధన ప్రభువా - నిన్ను నే కొనియాడెద