CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 190

ప్రభువా, గురి యొద్దకే

prabhuvaa, guri yoddake

ఫిలిప్పీ 3:7 "ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని"

More
పల్లవి:ప్రభువా, గురి యొద్దకే  - పరుగెత్తుచున్నాను నేను (2)ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని (2)
చరణం 1:ఏవేవి లాభకరములై యుండెనో - వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను
చరణం 2:క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్
చరణం 3:క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను
చరణం 4:వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను