CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 189

వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా

vintimayyaa nee svaramu kantimayyaa

మత్తయి 17:8 "యేసు తప్ప మరి యెవరును వారికి కనబడలేదు"

More
పల్లవి:వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును (1)ప్రియ ప్రభూ నిన్నుగాక వేరెవరిని చూడము వినము (2)
చరణం 1:భక్తి మర్మము గొప్పది యెంతో శరీరుడుగా మారిన దేవా (2) దూతలకు కనబడితివి (2) లోకమందు నమ్మబడియున్న దేవా (2)
చరణం 2:భయపడవలదని దూతలు తెల్పె - మహా సంతోషకరమైన వార్త రక్షకుడు పుట్టెనని పరమందు మహిమ భువికి శాంతియనిది
చరణం 3:నరరూప ధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసియున్నావు వేరెవ్వరు చేయలేరు – అద్భుతకరుడ ఘనత కలుగును గాక
చరణం 4:మూగవారికి మాటలిచ్చితివి - గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి మృతులను లేపితివి- పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా
చరణం 5:ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముల్లు విరచితివి - సమాధి నిన్ను గెలువక పోయెను
చరణం 6:ఇహము నుండి పరమున కేగి- మా కొరకు నీవు రానై యున్నావు ఆనందముతో కనిపెట్టెదము - మదియందే నిరీక్షణ కలిగి స్తుతింతుమ్