పల్లవి:నా ప్రాణ ప్రియుడా - నిన్నే స్తుతింతున్ (1)", "నా హృదియార - నిన్నే ఘనపరతున్ (1)", "నా నిరీక్షణకు ఆధారం నీవే (2)", "ఎల్లకాలం నిన్నే అందింతున్ (2)
చరణం 1:పాప పాశములు నను చుట్టిముట్టి - నిత్యనాశనముకు చేరువకాగా (2)
పావనుడేసు నా కట్లు త్రెంచ (2) సిలువలో బలియాయె (2)
గొప్ప రక్షణను నాకిచ్చెనని (2) - కొనియాడెదన్ (2)
చరణం 2:నాదు జీవిత యాత్రలో నాకు - జీవపు వెలుగు నీవైతివి
నాదు కష్ట సమయంబులలో - ఆశ్రయదుర్గమైతివి
నాదు కాపరివై జీవమార్గములో - నడిపితివే
చరణం 3:అలలు నన్ను ముంచజూచినను - బలుడేసు భయపడవద్దనెను
తల్లడిల్ల కుండ స్థిరపరచెనన్ను - తన సాక్షిగా నిలిపే
సజీవ యాగముగా నన్నే నీకు - అర్పించెదన్
చరణం 4:తల్లిదండ్రులు నన్ను విడిచినను - కన్నీళ్ళు నా కంట రాలినను
కలవరపడకు అంటివి ప్రభువా - కరుణను జూపితివే
కరములు జోడించి పూచించెద నిన్ను - నా ప్రభువా
చరణం 5:నిన్ను విడువను ఎడబాయనంటివి - నీ అరచేతిలో చెక్కిన ప్రభువా
అందరు మరిచిన మరువని దేవా - పొగడక ఎట్లుందున్
పరిశుద్ధులందరితో హల్లెలూయ పాడుచు - కీర్తింతున్