CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 164

ఆహా ఆనందమే - పరమానందమే

aahaa aanandame - paramaanandame

అపొ.కా.3:8 "నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయములోనికి వెళ్లెను"

More
పల్లవి:ఆహా ఆనందమే -  పరమానందమే - ప్రియ యేసు - నొసగె నాకుకొలతలేనిది - బుద్ధికందనిది -  ప్రేమన్ వివరింప  - వీలగునా? (2)
చరణం 1:నీచ ద్రోహినైన నన్ - ప్రేమతో చేర్చుకొని (2) పాప ఊబి నుండి నన్ - పైకి లేవనెత్తెను (2)
చరణం 2:నిత్యనాశన పురముకు - నే పరుగిడి వెళ్ళుచుండ నిత్య జీవమార్గములో - నన్ను నడిపితివి
చరణం 3:నిలిగిన రెల్లువలే - నేను విరిగెడు సమయములో నాకై విజ్ఞాపన చేసి - స్థిరపరచితివి ప్రేమతో
చరణం 4:హెచ్చరిక స్వరమును - త్రోసి వేసిన నన్ను ప్రేమ కొరడా దెబ్బతో - ఆదరించి చేర్చుకొంటివి
చరణం 5:కారు చీకటివేళలో - కలత చెందిన నన్ను కాచి ఓదార్చితివే - బలమైన నీ ఆత్మతో
చరణం 6:నాదు ప్రాణనాథుడా - నిన్నెప్పుడు గాంతునో ఆత్మప్రియుడా నిన్ను - చూడ ఆశ నాలో కలిగెను
చరణం 7:నీ ప్రేమ స్వరమున్ విని - నేను మేలుకొంటిని ప్రియుని రొమ్మును చేరను - నాలో వాంఛ ఉప్పొంగుచుండె
చరణం 8:మధ్యాకాశమునందున - ప్రభుని చేరెడు వేళలో ఆనందమానందమే - ఎల్లప్పుడానందమే