పల్లవి:సహింతుము శ్రమలన్నియు - యేసుకై సంతోషముతో (2)
చరణం 1:యేసు కొరకై ఈ లోకములో - నిందలు హింసలు పొందగా (2)
యేసు కూడ మన తోడుగా (2)
సహించి ఓదార్చి ప్రేమ జూపును
చరణం 2:నీతి కొరకై ఆకలి దప్పి - కల్గి మన మెల్ల వేచియుండ
నీతి సూర్యుడు మన తోడై
నీతిని నెరవేర్చి కృప జూపును
చరణం 3:సువార్త కొరకై చెరనుండినా- కొరడాల దెబ్బల సహించగా
దివారాత్రము గాయు ప్రభునేత్రము
కృపజూపి ప్రేమతో ఆదరించును
చరణం 4:లోకమందు పలు శ్రమలు - లోకస్తుల ద్వేషము వలన కలుగు
లోకాధికారి లోకమును
జయించిన ప్రభువే మనల గాయును
చరణం 5:క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత - ముందు ఈ శ్రమలెన్నదగినవి కావు
క్రీస్తుతో వారసులౌటకు
అర్హత మనము జూపు సహనమే