పల్లవి:యౌవనులారా - దేవుని శక్తిని బట్టిక్రీస్తులో మీరు - బలమునొందుడి (2)
చరణం 1:సాతాను తంత్రములన్ - ఎదుర్కొనుటకును
సర్వాంగ కవచమును - ధరించుకొనుటకును (2)
నిత్యము ఆయనలో - నిలిచియుండుడి (2)
చరణం 2:రక్షణ శిరస్త్రాణమున్ - ధరించుకొనుటకును
దేవుని వాక్యముతో - అన్నిటిన్ జయించుటకు
నిత్యము సహవాసములో - నిలిచియుండుడి
చరణం 3:సమయము పోనియ్యక - సత్యమును కలిగి
సర్వకాలము ప్రభుతో సహవాసమును కలిగి
నిత్యము మీ తీర్మానములో - నిలిచియుండుడి