పల్లవి:మా ప్రభుయేసు నీవే మా సర్వము-మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము (2)
చరణం 1:సంతృప్తి నీ మందిరమున గలదు (2) - అందానంద ప్రవాహంబు మెరిసింది (2)
వింతైన జీవపు యూటందు గలదు (2)
యెంతైన మా పూజార్హుండ నీవె (2)
చరణం 2:ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు - మొదటి ప్రేమనెంతో విడచి పెట్టితిని
సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
సతతంబు మా పూజార్హుండ వీవె
చరణం 3:మా తలపు మాటల్లో మా చూపు నడకలో
మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
యెక్కడైనా మా యేసు సన్నిధిలో
చరణం 4:పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము - పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
పాలించుము ప్రభుయేసు రారాజ
చరణం 5:సోదర ప్రేమ సమాధానంబులతో - సాత్వీక సంతోష భక్తి వినయాలతో
వింతైన మాదు స్తుతి పరిమళాలతో
వినయంబున పూజింతుము నిన్ను