CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 148

ఎటువంటి యాగంబు జేసితివి యేసు

etuvanti yaagambu jesitivi yesu

ఫిలిప్పీ 2:8 "సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనేను"

More
పల్లవి:ఎటువంటి యాగంబు జేసితివి యేసునీ వలె నేనుండ నా కొరకై (2)
చరణం 1:పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి (2) పశువుల తొట్టిలో పరుండియు- (2) - పరమ ప్రేమన్ జూపెను (1)
చరణం 2:జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు మాకై సిలువ బాధ నొందితివి - మమ్మును విమోచించన్
చరణం 3:తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండె నీకు నీ యడుగుజాడలలో నేనుండన్ - నా ముందు వెళ్ళితివి
చరణం 4:తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి నీ సిలువ మోయు వారెల్లరును - నీ మహిమఁజూచెదరు
చరణం 5:నీ శ్రమలు బాధలేగా నీ మహిమ లోనికి దెచ్చె నిన్ను నీకై నా జీవమెల్ల నియ్యను - నీ శ్రమలే నే కోరెదన్
చరణం 6:నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు నీ వెంట వెళ్ళను నే వెరువను - నీ ప్రేమ నాలో నుండ