పల్లవి:యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్యేసు గొఱ్రె పిల్లను - పోయెదను తన వెంట (2)
చరణం 1:పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్
స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి (2)
ముందు ముందు వెళ్ళుచు - పొందుగా రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును (2)
చరణం 2:మరణలోయ ద్వారా - సరిగా నడిపించును
అడవి భయములెల్ల - ఎడబాప్ రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును
చరణం 3:శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్దిజేసి - ఆత్మదానమిచ్చెను
వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను