CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 145

తన దేవునెరుగువారు

tana devuneruguvaaru

దాని, 11 : 32 "అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు."

More
పల్లవి:తమ  దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు (2)
చరణం 1:ఇచ్ఛకపు మాటల వలన (2) - అక్షయుని విడువరు (1) (2) తప్పు బోధల నెప్పుడు తృణీకరించెదరు (2)
చరణం 2:సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు
చరణం 3:మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు మంచి సాక్ష్యమును విడువరు ఏకాంతులు కారు
చరణం 4:ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను పర్వతము వలె కదలక వారు స్థిరముగ నుండెదరు
చరణం 5:అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు
చరణం 6:శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు
చరణం 7:అధిక జ్ఞానమును పొంది - తగ్గించుకొనెదరు తామే యేసుప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు