పల్లవి:పాపుల కొరకు ప్రభుయేసు - సిలువలో బలియాయె (1)పాపికి రక్షణనిచ్చెను - పావన రక్తము కార్చి (2)
చరణం 1:దుష్ట జగమున యేల తిరిగెదవు ప్రియుడా?
మునిగెదవేల ఎన్నడు పాపములో ? (2)
దాచిన నీవు నీ పాపమును ప్రియుడా
నిత్యజీవమును ఎలాగు పొందెదవు? (2)
చరణం 2:పాపభారము క్రింద పడియున్న ప్రియుడా
ప్రభునికడకు రమ్ము విశ్రాంతికై
నెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడా
యిదియే యేసుని వాగ్దానము నమ్ము
చరణం 3:నరక మార్గము విశాలము ప్రియుడా
జీవమునకు పోవు మార్గము ఇరుకు
ప్రభుయేసువే నిజమార్గము ప్రియుడా
పరము చేరుదువు యేసుని ద్వారానే
చరణం 4:ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడా",
"పాప దుఃఖముతో నిండియున్నది
దీనుడవై నీవు శుద్ధిని కోరుము ప్రియుడా
దొరుకును రక్షణ యీ క్షణమే