పల్లవి:పరుగిడరా సోదరుడా (1 ) - ప్రభు సన్నిధి నీవు జేరుటకై (2)
చరణం 1:యుగసమాప్తికి ఆగమనమునకు - సూచన లెన్నో చూడుమురా (2)
వేదన లెన్నో మీదికి వచ్చురా (2)
కలవర మొందక కనిపెట్టుమురా(2)
చరణం 2:ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు - నారును నాటుచు త్రాగుచు తినుచు
జగములో జనులు దిగులు లేనప్పుడు
దొంగవలె యిల దొరయై వచ్చురా
చరణం 3:ఆ దినమైనను ఆ గడియైనను - పరమున దూతలు ధరణిలో మనుజులు
ఎవరును గాని ఎరుగనె ఎరుగరు
మెలకువతో యేసు పిలుపును వినుచు
చరణం 4:ఆ దినముల శ్రమ అంతము కాగ - సూర్యుని చంద్రుని చీకటి కమ్ము
ఆకసమందలి శక్తులు కదలును
మహిమతో యేసు యిమ్మహి దిగురా
చరణం 5:ఆర్భాటముతో ఆశ్చర్యముతో - దేవుని బూరతో మనప్రభు దిగురా
క్రీస్తునందున్న మృతులగువారు - ఏకముగ ప్రభు యేసుని జేర
చరణం 6:ఎటుచూచిన నీకటు కనిపించును - కొండల బండల నుండినను
కొదమ సింహమై కోసాగ్నియై - ఎదురుగ వచ్చిన కదలగ లేవురా
చరణం 7:ఎత్తబడుట కాయత్తమా నీవు - తరుణము యిదియే తడవు చేయకురా
రక్షణలో నిరీక్షణ కలిగి - రక్షకు డేసుని రాజ్యము చేర