పల్లవి:యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)నీ పోలికగా నేను మారెదన్ (2)
చరణం 1:యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి - దీనుడవైతివి (2)
నేను దీనుడను గాను - గర్వముతో నిండియున్నాను
నీ వినయముతో నింపుము
చరణం 2:ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి (2)
ఈ ప్రేమ చూపలేను - కఠినుడనై యున్నాను
నీ ప్రేమతో నింపుము (2)
చరణం 3:ప్రభువా నీవందరి యెడల - శాంతము వహించితివి
ఎవరును నశింపక యుండవలెనని (2)
నేను సహింపలేను - సహనమునే కోల్పోయాను
నీ శాంతముతో నింపుము (2)
చరణం 4:నమ్మకమైన ప్రభువా - నీ కార్యము అద్భుతము
నీ సత్యము మేఘములనంటుచున్నది
నేనయోగ్య దాసుడను - నిన్ను దుఃఖపెట్టియున్నాను
నీ యథార్థతతో నింపుము (2)
చరణం 5:యేసుని స్వరూపము కల్గి - ఆయనవలె మారెదన్
ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ (2)
ఆ అద్భుత దినము కొరకు - నను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము (2)