పల్లవి:నా ప్రాణమెంతో నిన్ను పాడును గొప్ప దేవా - గొప్ప దేవానా ప్రాణమెంతో నిన్ను పాడును గొప్ప దేవా - గొప్ప దే..... వా ! (1)
చరణం 1:ప్రభు నా దేవా - నీ చేతి కార్యములను
ఆశ్యర్యముతో నే నెంచి చూడగన్ (1)
తారలజూచి గంభీర యురుముల వినగా
విశ్వమంత నీ శక్తిన్ - కనుపరచన్ (1)
చరణం 2:అడవులందు నే సంచరించగను
పక్షుల మధుర సంగీతముల్ వినగా
పర్వతశోభ నే పరికించి చూడ
సెలయేరుల చల్లగాలి సోక || నా ||
చరణం 3:ప్రియసుతుని నా కొరకై చనిపోవ
పంపుట తలచి భరించ గలనా?
సిలువ పైని నా భారమంత మోసి
పాపము తీయ రక్తము కార్చెను || నా ||
చరణం 4:ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి
పరగృహమునకు నను గొనిపోయెడి వేళ
ఆనందముతో పూజించి ప్రకటింతు
ఓ నాదేవా నీవే ఘనుడవంచు! || నా ||